Pocharam: పోచారం ఐటీ కారిడార్‌లో 15వ అంతస్తు నుంచి పడి పెయింటర్ మృతి!
Pocharam: పోచారం ఐటీ కారిడార్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ 15వ అంతస్తు నుంచి పడి మధ్యప్రదేశ్‌కు చెందిన పెయింటింగ్ కార్మికుడు మృతి చెందాడు.
Pocharam: పోచారం ఐటీ కారిడార్‌లో 15వ అంతస్తు నుంచి పడి పెయింటర్ మృతి!
Pocharam: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ 15వ అంతస్తు నుంచి కిందపడి ఓ పెయింటింగ్ కార్మికుడు మృతిచెందిన విషాద ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. జోడిమెట్ల సమీపంలోని హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి వద్ద హరిహర కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హరిహరస్ శ్రీ సాయి కాకతీయ అపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్ (35)కుమార్ పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు 15వ అంతస్తు నుంచి రెండో సెల్లార్‌లో పడిపోయినట్లు సమాచారం.
తీవ్ర గాయాల కారణంగా ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో నిర్మాణ ప్రాంగణంలో కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవసరమైన భద్రతా పరికరాలు, రక్షణ చర్యలు కల్పించకుండానే పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించారా? లేదా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిర్మాణ సంస్థ లేదా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉందా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.