Medak: మెదక్ జిల్లాలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు

Medak: మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట సొసైటీలో యూరియా బస్తా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు. ఆన్‌లైన్ యాప్ కష్టాలపై తీవ్ర విమర్శలు.

Update: 2026-08-12 11:12 GMT

Medak: మెదక్ జిల్లాలో యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కిన రైతు

మెదక్: మెదక్ ఆగస్టు 12 ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతు రైతు పంటలు పండించకపోతే మనుగడలేదు అలాంటి కష్టాలు వస్తే ప్రభుత్వం ఆదుకోవాలి కానీ ప్రభుత్వమే కష్టాలను సృష్టిస్తే రైతు పరిస్థితి ఏమిటి.

యూరియా కోసం ఒకప్పుడు క్యూ లైన్ కట్టిన రైతులు అష్ట కష్టాలు పడేవారు నేడు యాప్ లో ఆన్లైన్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలో తెలియకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారు.

యూరియా కోసం వ్యవసాయ అధికారుల కాలు పట్టుకున్న వ్యవసాయ అధికారులు కనికరించకపోవడంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఈ సంఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట సొసైటీ లో యూరియా బస్తా కావాలంటూ సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతున్న ఆ రైతులు పట్టించుకోలేదు.

ఒకవైపు ప్రకృతి సహకరించి వర్షాలు పడుతున్న నేపథ్యంలో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు నిరంతరం పంటలు పండిస్తూ సమాజ మన గడ కోసం కష్టపడుతున్న రైతుకు గోసాలు తప్పడం లేదు.

Tags:    

Similar News