Asifabad: చింతలమానేపల్లిలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ!
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి గ్రామ పంచాయతీలో నూతన పెన్షన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య ప్రొసీడింగ్స్ కాపీలు పంపిణీ చేశారు.
Asifabad: చింతలమానేపల్లిలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ!
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రం గ్రామ పంచాయతీలో తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా, చింతల మానేపల్లి మండలకేంద్ర లోని నూతన పెన్షన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ కాపీలను మాజీ ఎంపీపి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు డుబ్బుల నానయ్య అందజేశారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్ల ద్వారా అండగా నిలుస్తోంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డుబ్బుల నానయ్య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & మాజీ ఎంపీపీ, చింతలమానేపల్లి మండలం, కౌటాల మాజీ ఎంపీపీ డుబ్బుల వెంకన్న, చింతల మానేపల్లి సర్పంచ్ మేకల పోషక్క, ఉప సర్పంచ్ టోంబిరే శ్రీనివాస్,గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇంగాని ఇస్తారి,మాజీ సర్పంచ్ మేకల ప్రసాద్,గ్రామ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.