Chintalamanepally: చింతలమానేపల్లి మండలం గూడెంలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్ టెక్నికల్ ఛార్జ్
Chintalamanepally: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు టెక్నికల్‌గా ఛార్జ్ చేశారు.
Chintalamanepally: చింతలమానేపల్లి మండలం గూడెంలో నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్ టెక్నికల్ ఛార్జ్
చింతలమానేపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యంగా టీజీ ఎన్పీడీసీఎల్ చేపడుతున్న అభివృద్ధిలో భాగంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను టెక్నికల్‌గా ఛార్జ్ చేశారు.
చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను గురువారం డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూధన్ సంయుక్తంగా టెక్నికల్‌గా ఛార్జ్ చేశారు.
132 కేవీ కౌటాల సబ్‌స్టేషన్ నుండి వచ్చే 33 కేవీ బెజ్జూర్ ఫీడర్‌కు అనుసంధానిస్తూ నిర్మించిన ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడంతో గూడెం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత పటిష్టం కానుందని డైరెక్టర్లు తెలిపారు.
స్థానికంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు, లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతుందని, ముఖ్యంగా గృహ, వ్యవసాయ, వాణిజ్య వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు.
పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంపై సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆపరేషన్స్ కొమురం భీం ఆసిఫాబాద్ జాడే ఉత్తమ్, డీఈలు, ఏడీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.