Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కాంలో తమ ప్రమేయం లేదు
Bellampalli: బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కాంలో తమ ప్రమేయం లేదన్న కాంగ్రెస్ నేతలు బత్తుల రవి, వెంబడి సురేష్; మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీడీవోపై ఆరోపణలు.
Bellampalli: నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కాంలో తమ ప్రమేయం లేదు
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, బూదాకుర్డ్ కారోబార్ చిలుముల రవి తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, కాంగ్రెస్ నాయకుడు వెంబడి సురేష్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ అని వారు ఆరోపించారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బూదాకుర్డ్ గ్రామపంచాయతీలో మొత్తం 16 డెత్ సర్టిఫికెట్లు జారీ కాగా, వాటిలో అధిక సంఖ్యలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ బంధువులకు సంబంధించినవే ఉన్నాయని వారు పేర్కొన్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో పోలీసుల విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కేసులో కారోబార్ రవిని బయటకు తీసుకొచ్చేందుకు, ఆయనకు బెయిల్ ఇప్పించేందుకు సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామ సర్పంచ్ మహిళ అయినప్పటికీ గ్రామాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ దుర్గం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేకు బంధువని తెలిపారు. ఎంపీడీవో డ్రైవర్ చిలుముల రవి, బీఆర్ఎస్ నాయకుడు అశోక్ గౌడ్, బూదాకుర్డ్ వార్డు సభ్యుడు ఎంబడి చంద్రశేఖర్లు ఎంపీడీఓ తో సంబంధాలు కలిగి ఉండి, కారోబార్ చిలుముల రవి ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, అసలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బరిగెల రవి, మొకెనపల్లి బాలకృష్ణ, సల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.నకిలీ డెత్ సర్టిఫికెట్ల స్కాంలో తమ ప్రమేయం లేదు కారోబార్ రవి ఆరోపణలు అవాస్తవం.. మాజీ జెడ్పీ వైస్ చైర్మన్, ఎంపీడీవోపై బత్తుల రవి, వెంబడి సురేష్ ఆరోపణలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని, బూదాకుర్డ్ కారోబార్ చిలుముల రవి తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కాంగ్రెస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి బత్తుల రవి, కాంగ్రెస్ నాయకుడు వెంబడి సురేష్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అసలు బాధ్యులు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ అని వారు ఆరోపించారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
బూదాకుర్డ్ గ్రామపంచాయతీలో మొత్తం 16 డెత్ సర్టిఫికెట్లు జారీ కాగా, వాటిలో అధిక సంఖ్యలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ బంధువులకు సంబంధించినవే ఉన్నాయని వారు పేర్కొన్నారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంలో పోలీసుల విచారణకు తాము అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఈ కేసులో కారోబార్ రవిని బయటకు తీసుకొచ్చేందుకు, ఆయనకు బెయిల్ ఇప్పించేందుకు సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామ సర్పంచ్ మహిళ అయినప్పటికీ గ్రామాభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ దుర్గం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేకు బంధువని తెలిపారు. ఎంపీడీవో డ్రైవర్ చిలుముల రవి, బీఆర్ఎస్ నాయకుడు అశోక్ గౌడ్, బూదాకుర్డ్ వార్డు సభ్యుడు ఎంబడి చంద్రశేఖర్లు ఎంపీడీఓ తో సంబంధాలు కలిగి ఉండి, కారోబార్ చిలుముల రవి ద్వారా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
నకిలీ డెత్ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇప్పటికే పోలీసుల విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, అసలు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బరిగెల రవి, మొకెనపల్లి బాలకృష్ణ, సల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.