Asifabad: ఆసిఫాబాద్లో ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
Asifabad: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి నివాళులర్పించారు.
Asifabad: ఆసిఫాబాద్లో ఘనంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
ఆసిఫాబాద్: భారత తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రిగా దేశ అభివృద్ధికి పునాదులు వేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాపర్తి మురళి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విశ్వనాథ్, డీసీసీ ఉపాధ్యక్షులు తారిఖ్, భీంరావు, కార్యదర్శి నాంపెల్లి శంకర్, మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ కాలీం, కార్యదర్శి షేక్ అజీముద్దీన్, ఎస్సీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జాడి ప్రసాద్, మండల ఉపాధ్యక్షుడు కనక నాగోరావు, ప్రధాన కార్యదర్శులు మర్రి బాలు యాదవ్, బట్టుపల్లి కమలాకర్, టౌన్ కార్యదర్శి బాలు, మాజీ ఎంపీటీసీ సిడాం తిరుపతి, మాజీ సర్పంచ్ కాసయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాడే ప్రభాకర్, రత్నం ఆనందరావు, యూత్ కాంగ్రెస్ నాయకుడు సత్రవేణి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.