Veldanda: నీట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఆర్థిక సాయం

Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పిల్లికండ్ల తండా విద్యార్థి రత్లావత్ వినోద్ నీట్‌లో 3000 ర్యాంకు సాధించగా నగదు బహుమతి అందజేసి సన్మానించిన నేతలు.

Update: 2026-08-16 14:36 GMT

Veldanda: నీట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థికి ఆర్థిక సాయం

వెల్దండ: వెల్దండ మండలం పరిధిలోని ఎం.జి. కాలనీ తండా గ్రామ పంచాయతీలోని పిల్లికండ్ల తండా గ్రామానికి చెందిన రత్లావత్ మణిపాల్ కుమారుడు రత్లావత్ వినోద్ నీట్ -కురుక్షేత్ర (హర్యానా)లో ఈ.ఈ.ఈ సీటు ఆల్ ఇండియా 3000 ర్యాంకు సాధించడం జరిగింది.

ఈ విషయాన్ని తెలుసుకున్న కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉమా మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ ఆదివారం సన్మానించి రూ.10 వేల రూపాయలు మరియు అల్లంతోట బావి తండా సర్పంచ్ రోజా అరుణ్ నాయక్ రూ.5 వేల రూపాయలు మొత్తం రూ.15 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది.

అనంతరం సంజీవ్ కుమార్ యాదవ్ ప్రతీ సంవత్సరం రూ.10 వేల రూపాయలు అందజేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమములో మాజీ సర్పంచ్ కుమార్,మాజీ ఎంపీటీసీ సభ్యులు చిట్టి కడురం, గ్రామ కమిటీ అధ్యక్షులు సుధీర్,ఎల్ ఎచ్ పి ఎస్ మండల అధ్యక్షులు నర్సింగ్,అజయ్ మాజీ వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News