Kalwakurthy: వెల్దండ గిరిజన భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Kalwakurthy: వెల్దండ గిరిజన భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అజిత్ నాయక్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ.
Kalwakurthy: వెల్దండ గిరిజన భవన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ ఆగస్టు 15 : వెల్దండ మండల కేంద్రంలోని గిరిజన భవన్ లో గిరిజన సంఘం అధ్యక్షులు అజిత్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం అజిత్ నాయక్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రోద్యమంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహానీయుల మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హరికిషన్ నాయక్ ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రధాన కార్యదర్శి బానావత్ శంకర్ నాయక్ ,వెంకట్ నాయక్,కాడు రామ్ నాయక్ పంతు నాయక్, లక్ష్మణ్ నాయక్, లాలు నాయక్ రవీందర్ నాయక్, భరత్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.