Dornala: ఓటర్ల సమగ్ర సర్వేకు సహకరించాలి తహసిల్దార్
Dornala: ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో జరుగుతున్న ఓటర్ల సమగ్ర సర్వే కార్యక్రమానికి ఓటర్లందరూ సహకరించాలని తహసిల్దార్ అశోక్ కుమార్ రెడ్డి కోరారు.
Dornala: ఓటర్ల సమగ్ర సర్వేకు సహకరించాలి తహసిల్దార్
Dornala: దోర్నాల మండలంలో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సమగ్ర సర్వే (ఎన్యూమరేషన్) కార్యక్రమానికి మండలంలోని ఓటర్లందరూ సహకరించాలని అశోక్ కుమార్ రెడ్డి తహసిల్దార్, సహాయ ఎన్నికల నమోదు అధికారి కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తిగా నింపి సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓలకు) అందజేయాలని సూచించారు. ఫారంతో పాటు రెండు తాజా కలర్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు అదనపు గుర్తింపు పత్రంగా పాన్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్‌బుక్, పట్టాదారు పాస్ పుస్తకం లేదా పెన్షన్ పాస్ పుస్తకాల్లో ఏదైనా ఒకటి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఓటర్ల నివాసాలకు బీఎల్ఓలు నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తున్నందున ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అవసరమైన పత్రాలు, వివరాలు సమర్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
సర్వే ప్రక్రియకు గడువు తక్కువగా ఉన్నందున ఓటర్లందరూ వెంటనే స్పందించి ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని, ఎన్నికల జాబితాల రూపకల్పనలో ఖచ్చితత్వం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి సహకరించాలని తహసిల్దార్ విజ్ఞప్తి చేశారు.