Athmakuru: నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్దపులి గోర్లు కలకలం!
Athmakuru: నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వు పరిధిలోని నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్దపులి గోర్లు లభించడం కలకలం రేపింది.
Athmakuru: నంద్యాల జిల్లా ఆత్మకూరులో పెద్దపులి గోర్లు కలకలం!
Athmakuru: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వులో పెద్ద పులులు అదృశ్యం కావడం, ఆకస్మిక మరణాలతో సంచలనం సృష్టిస్తుంటే.. మరోవైపు పెద్దపులి గోర్లు ఓ వ్యక్తి వద్ద లభించడం నంద్యాల జిల్లా ఆత్మకూరులో కలకలం రేపింది. నిందితుడి వద్ద నుంచి ఆరు పులి గోర్లను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు నిందితున్ని అదుపులోకి అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు.
శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మోటార్ బైక్ పై వెళ్తుండగా .. ప్రత్యేక స్క్వాడ్ బలగాలు ఆకస్మిక పనికి చేసింది. ఆ వ్యక్తి వద్ద ఆరు పెద్దపులి గోర్లు లభ్యమయ్యాయి. వెంటనే అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ఇటీవల అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం నాడు ఆత్మకూరు అటవీ డివిజన్ నాగ లూటీ రేంజ్ వరదరాజస్వామి ప్రాజెక్టు సమీపంలో ఓ ఆడ పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ మరుసటిరోజే ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్ రాచర్ల నల్లమలలో ఓ పెద్దపులిని వేటగాళ్లు చంపి నాలుగు కాళ్లు నరికి ఎత్తుకెళ్లారు.
ఈ సంఘటనపై కేంద్ర ఎంపీ సీఏ తీవ్రంగా స్పందించి ఫైవ్ మెన్ హైపర్ కమిటీని దర్యాప్తుకు ఆదేశించింది.
ఆ బృందాలు విచారణకు దిగిన 24 గంటల్లోనే ఆత్మకూరులో పెద్దపులి గోర్లు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.
ఇదిలా ఉంటే పులి గొర్ల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితుడి బంధువులు అటవీ శాఖ అధికారుల ఎదుట వాపోతున్నారు.
ఏది ఏమైనా పెను సంచలనం రేకెత్తించిన పెద్దపులి గొర్ల సంఘటన పై దర్యాప్తు జరుపుతున్న ప్రత్యేక బృందాలు తమ నివేదికలో ఏమి తెలుస్తాయో వేచి చూడాల్సి ఉంది.