Gudur: గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. నన్ను ఆశీర్వదించండి: గోపాల్ రెడ్డి!
Gudur: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురం టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసి, గ్రామాభివృద్ధికి ఆశీర్వదించాలని కోరారు.
Gudur: గ్రామాభివృద్ధికి కృషి చేస్తా.. నన్ను ఆశీర్వదించండి: గోపాల్ రెడ్డి!
కర్నూలు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ కార్యక్రమానికి మద్దతుగా వందలాది మంది గ్రామ ప్రజలు హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామా సమగ్ర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న తాగునీటి డ్రైనేజ్ సమస్య ల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. గ్రామం అభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
గ్రామ పెద్దలు, ప్రజలు తనకు అవకాశం ఇచ్చి సర్పంచ్‌గా గెలిపించాలని గోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ర్యాలీ గా తరలివచ్చి మద్దతు తెలిపిన గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.