Nandyal: ‘నా ఏరియాలో తాగుతారా?’ అని దాడి చేసిన రౌడీషీటర్ ఇమ్రాన్!
Nandyal: నంద్యాలలోని వెంకటేశ్వర బార్‌లో రౌడీషీటర్ ఇమ్రాన్ వీరంగం సృష్టించాడు. ముగ్గురిపై బీర్ బాటిళ్లతో దాడి చేసి గాయపరచగా సీసీటీవీలో దృశ్యాలు రికార్డయ్యాయి.
Nandyal: ‘నా ఏరియాలో తాగుతారా?’ అని దాడి చేసిన రౌడీషీటర్ ఇమ్రాన్!
Nandyal: నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర బార్‌లో రౌడీషీటర్ ఇమ్రాన్ వీరంగం సృష్టించాడు.
దళితపేటకు చెందిన రాజు, దేవా, మల్లి బార్‌లో మద్యం సేవిస్తుండగా.. తన ఏరియాకు వచ్చి మద్యం సేవించే ధైర్యం ఎలా వచ్చిందంటూ ఇమ్రాన్ వారితో గొడవకు దిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో బీర్ బాటిల్‌తో ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఘటనలో రాజు, దేవా, మల్లికి గాయాలు కాగా.. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కాగా, బార్‌లో జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
ఉప్పరిపేటలోని బాలకొండ హాల్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్‌పై గతంలో ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దాడికి సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.