Kurnool: నీళ్ల చారు, ఉడకని అన్నం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి!

Kurnool: కర్నూలు జిల్లా హొళగుంద ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని మధ్యాహ్న భోజనంపై ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం.

Update: 2026-08-12 05:51 GMT

Kurnool: నీళ్ల చారు, ఉడకని అన్నం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి!

Kurnool: కర్నూలు జిల్లా హోల్లగుంద ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించకుండా నీళ్ల చారు, ఉడికి ఉడికిన అన్నం అందిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, అనంతరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అయితే హొళగుందలో మధ్యాహ్న భోజనం పేరుతో నీళ్ల చారు, ఉడికి ఉడికిన అన్నం అందిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడే విధంగా నాణ్యతలేని భోజనం అందిస్తే సహించేది లేదన్నారు.

“విద్యార్థులకు నాణ్యతలేని భోజనం పెడుతున్న ప్రస్తుత వంట ఏజెన్సీ మాకు వద్దు. వెంటనే ఆ ఏజెన్సీని రద్దు చేసి, నాణ్యమైన భోజనం అందించే ఏజెన్సీని ఏర్పాటు చేయాలి” అని డిమాండ్ చేశారు.

మధ్యాహ్న భోజనాన్ని నిర్ణీత సమయానికి వండి, వేడిగా, నాణ్యతతో విద్యార్థులకు అందించాలని కోరారు. అధికారులు పాఠశాలలు, కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసి భోజన నాణ్యతను పరిశీలించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులు తీవ్రంగా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

సమస్యను వెంటనే పరిష్కరించకపోతే విద్యార్థులను ఐక్యం చేసి మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు మల్లయ్య, వచ్చిరప్ప, నాయకులు మహేష్, రాజు, గౌస్, విజయ్‌తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:    

Similar News