Nandyal: స్టేజ్‌పై చిరంజీవి స్టెప్పులేసిన నంద్యాల కలెక్టర్!

Nandyal: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ డే వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి హుక్ స్టెప్ పాటకు ఉత్సాహంగా డాన్స్ చేశారు.

Update: 2026-06-24 12:41 GMT

Nandyal: స్టేజ్‌పై చిరంజీవి స్టెప్పులేసిన నంద్యాల కలెక్టర్!

నంద్యాల జిల్లా: చిరంజీవి హుక్ స్టెప్ పాటకు స్టెప్పులేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి.. సాధారణంగా జిల్లా కలెక్టర్ అంటే కఠిన నిర్ణయాలు, అధికారిక సమావేశాలు గుర్తుకు వస్తాయి. కానీ నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాత్రం ఈసారి పూర్తిగా భిన్నంగా కనిపించారు. అధికారిక కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాటకు స్టెప్పులు వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

నంద్యాల జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో సందడి నెలకొంది జూన్ 20న జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి స్టేజ్‌పై డాన్స్ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ వరప్రసాద్ సినిమాలోని ఫేమస్ హుక్ స్టెప్ పాటకు కలెక్టర్ ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.

కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కూడా స్టేజ్‌పై కలిసి డాన్స్ చేయడంతో కార్యక్రమం మరింత ఉత్సాహంగా మారింది. సాధారణంగా గంభీరంగా కనిపించే అధికారులు ఇలా సరదాగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కలెక్టర్ రాజకుమారి ఎనర్జీ, స్పోర్టివ్ స్పిరిట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.పాలనలో క్రమశిక్షణతో పాటు, సందర్భానుసారంగా ఉత్సాహాన్ని పంచడం కూడా నాయకత్వ లక్షణమే అని నంద్యాల కలెక్టర్ మరోసారి నిరూపించారు.

Tags:    

Similar News