Ramapuram: రామాపురంలో వైభవంగా శ్రీ సిద్ధి గణపతి విగ్రహ ప్రతిష్ట: పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

Ramapuram: మార్కాపురం జిల్లా రాచర్ల మండలం రామాపురంలో శ్రీ సిద్ధి గణపతి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది.

Update: 2026-05-11 12:09 GMT

రాచర్ల (మార్కాపురం జిల్లా): మార్కాపురం జిల్లాగిద్దలూరు నియోజకవర్గం లోని రాచర్ల మండలం గుడిమెట్ట పంచాయతీ రామాపురం గ్రామంలో శ్రీ సిద్ధి భీమేశ్వరస్వామి ఆవరణ లో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానములో శ్రీ సిద్ధి గణపతి విగ్రహం ప్రతిష్ట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి ఆశీర్వాదం పొందినారు అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యే గారికి శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండలం నాయకులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News