Nandyal: తాండవ మల్లేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ ప్రారంభం

Nandyal: ఆత్మకూరు సమీపంలోని ప్రాచీన తాండవ మల్లేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి సంకల్ప క్రతువులు ప్రారంభమయ్యాయి.

Update: 2026-05-11 12:09 GMT

Nandyal

Nandyal:వేద కాలం నాటి శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఆలయం ఎట్టకేలకు జీర్ణోదరణకు నోచుకుంది. ప్రాచీన ఆలయమైన ఈ క్షేత్రానికి చారిత్రక, ఇతిహాస నేపద్యమున్న ఈ ఆలయం శిధిలావస్థకు చేరింది. ఎట్టకేలకు భక్తులు, గ్రామస్తులు ముందుకొచ్చి నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ ప్రాంతం, కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత తాండవ మల్లేశ్వర ఆలయానికి అతి ప్రాచీన ఇతిహాస నేపద్యం ఉంది. శ్రీశైల క్షేత్రానికి పూర్వమే ఈ ఆలయం వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అప్పట్లో దక్షుడు సప్త నది సంగమేశ్వర కృష్ణా తీరంలో తలపెట్టిన దక్షయజ్ఞనికి పిలవకపోయినా సతీదేవి వెళ్తుంది. తండ్రి దక్షుడు చేసిన అవమానానికి అక్కడే యజ్ఞవాటికలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఇది తెలిసి పరమశివుడు ఉగ్రరూపం దాల్చి సతీదేవి శరీరాన్ని మెడపై తీసుకొని తాండవం చేసిన ప్రదేశంగా కొత్తపల్లి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ పార్వతీ సమేత పాండవ మల్లేశ్వర స్వామి రచన ఆలయానికి పురాణ ఇతిహాస నేపథ్యం ఉంది. ఇంతటి ప్రఖ్యాత ప్రాచీన ఆలయం జీర్ణోదరణకు నోచుకోలేదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వ శ్రేయోనిది ద్వారా నూతన ఆలయాన్ని నిర్మించేందుకుగాను ఆలయం నుంచి రూ. 30 లక్షలు జమ చేస్తే.. దేవాదాయ శాఖ రూ. కోటి రూపాయలకు పైగా నిధులను విడుదల చేసి ఆలయాన్ని పునర్ నిర్మిస్తుంది. అందులో భాగంగా ప్రధాన ఆలయం, పరివార దేవాలయాల జీర్ణతరణను ఆలయ అర్చకులు శుభసంకల్ప క్రతువులు ఆరంభించారు. మహన్యాస పారాయణ పాశుపత ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీ లలిత సహస్ర నామ సూక్తులు, కుంకుమార్చనలు విశేషంగా జరిగాయి. శ్రీశైల మల్లికార్జున లింగాన్ని పోలిన రీతిలో ఇక్కడి తాండవ మల్లేశ్వర స్వామి గర్భగుడిలో శివలింగం పోలి ఉండడం విశేషం. నూతన ఆలయ నిర్మాణ సంకల్ప క్రతువుల అనంతరం దాతలు, భక్తాదలు లక్షలాధి రూపాయల విరాళాలను దేవస్థానానికి అందజేశారు.

Tags:    

Similar News