Pattikonda: 38 మంది లబ్ధిదారులకు రూ. 18 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

Pattikonda: ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ తన నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు రూ.18 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.

Update: 2026-08-01 14:31 GMT

Pattikonda: 38 మంది లబ్ధిదారులకు రూ. 18 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

పత్తికొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పాలన కొనసాగుతోందని పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్ అన్నారు.

శనివారం పత్తికొండలోని తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.18 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు. పేద ప్రజలకు కష్టకాలంలో అండగా నిలవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, వేగవంతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తున్నాం. పత్తికొండ నియోజకవర్గ ప్రజలకు అవసరమైన ప్రతి సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రభుత్వంపై నమ్మకం ఉంచి దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందేలా నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని, ప్రజల సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.

ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఎమ్మెల్యే కే.ఈ. శ్యామ్ కుమార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News