Kurnool: ఎస్సీ యువత ప్రజల భారీ ర్యాలీ నందవరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

Kurnool: నియోజకవర్గం నందవరం మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు.

Update: 2026-07-11 14:56 GMT

Kurnool: ఎస్సీ యువత ప్రజల భారీ ర్యాలీ నందవరంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ

కర్నూలు: ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండల కేంద్రంలో నిర్వహించిన భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవంలో ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ఘనంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నందవరం మండలంలోని గ్రామ ప్రజలు, యువత ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గారు, భారీ ర్యాలీలో పాల్గొంటూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక కార్యక్రమాల నడుమ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి, సభలో పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్త మాత్రమే కాకుండా, సామాజిక న్యాయం, సమానత్వం, విద్య మరియు అణగారిన వర్గాల సాధికారతకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని, అందరివాడని కొనియాడారు. రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించే శక్తివంతమైన పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్యను ఆయుధంగా చేసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే, కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి మరియు ప్రతి వర్గం సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, డాక్టర్ అంబేద్కర్ కలలుగన్న సమానత్వ సమాజ నిర్మాణ దిశగా ప్రజలందరూ కలిసి ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో నందవరం మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు, అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు, ఏఎంసీ చైర్మన్, టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షులు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్, మార్కెట్ యార్డు డైరెక్టర్, డిసేబుల్డ్ వెల్ఫేర్ & మల్లెల ట్రస్ట్ అధినేత, టీడీపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, నందవరం మండలం మరియు వివిధ గ్రామాల ఎస్సీ యువకులు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News