Kurnool: విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం

Kurnool: కర్నూలు జిల్లా గూడూరులోని విశ్వభారతి మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 200 కేజీల పురుగుల బియ్యాన్ని సీజ్ చేశారు.

Update: 2026-07-12 06:57 GMT

Kurnool: విశ్వభారతి మెడికల్ కాలేజీలో పురుగుల అన్నం

కర్నూలు: గూడూరు మండలం పెంచికలపాడు దగ్గర గల విశ్వభారతి మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు పురుగులు ఉన్న అన్నని కాంట్రాక్టర్ పెడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది.చాలా రోజుల నుంచి ఎలాంటి శుభ్రత పాటించకుండా ఆహారాన్ని తయారు చేసి కాలేజీ విద్యార్థులకు, హాస్టల్ విద్యార్థులకు వడ్డీస్తున్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిసి కొంత మంది హాస్టల్ విద్యార్థులు pgrs కు ఫొటోలతో కంప్లైంట్ ఇచ్చారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అండ్ కంట్రోల్ అధికారులు కాలేజీ హాస్టల్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో పురుగులు పట్టిన బియ్యానికి గుర్తించారు.

సుమారు 200కేజీల బియ్యాని సీజ్ చేశామని ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించి చెన్నై లాబ్ కు పంపించమని కర్నూలు జిల్లా జేసీ కోర్టులో విచారణ జరుగుతుందని రిపోర్టులు వచ్చాక కాంట్రాక్టర్ పై చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు తెలిపారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్ ను రద్దు చేసి వాడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.

Tags:    

Similar News