Kurnool: కర్నూలు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
Kurnool: కర్నూలులో 'నమస్తే' కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం. వారి ఆరోగ్యం, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన కమిషనర్ ఓబులేసు.
Kurnool: కర్నూలు పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరం
కర్నూలు: పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నట్లు కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో నమస్తే (నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్) కార్యక్రమంలో భాగంగా మెడికవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమం నగరపాలక సంస్థకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమని, వారి ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
నమస్తే కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగా యాంత్రీకృత పారిశుద్ధ్య వ్యవస్థలను ప్రోత్సహించడం, ప్రమాదకర మానవ పారిశుద్ధ్య విధానాలను నిర్మూలించడం, వ్యక్తిగత రక్షణ పరికరాల వినియోగాన్ని విస్తృతం చేయడం, పారిశుద్ధ్య కార్మికుల వృత్తి భద్రత, ఆరోగ్య పరిరక్షణ, నైపుణ్యాభివృద్ధి, సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడం కోసం కట్టుబడి ఉనైనా
వైద్య శిబిరంలో రక్తపోటు, యాదృచ్ఛిక రక్త చక్కెర పరీక్ష, ఈసీజీ, ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష, ద్విమితీయ ఎకో పరీక్ష, నేత్ర పరీక్ష, దంత పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. అవసరమైన వారికి నిపుణులైన వైద్యులు ఆరోగ్య సలహాలు అందించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, మెడికవర్ ఆసుపత్రి జనరల్ మేనేజర్ వై. మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్. ఖాదర్ బాషా, పల్మనాలజీ నిపుణులు డాక్టర్ వినోద్ ఆచారి, న్యూరో ఫిజీషియన్ డాక్టర్ రఘునందిని, ప్రసూతి & స్త్రీరోగ నిపుణురాలు డాక్టర్ పావని, జనరల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ ఇమ్రాన్, వైద్య శిబిర సమన్వయకర్తలు బాలన్న, బాల మద్దిలేటి, శేషు నాయుడు, కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.