Srisailam: శ్రీశైలంలో అర్హతల్లేని సెక్యూరిటీ గార్డుల దందా? భక్తుల ఆగ్రహం

Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో పనిచేస్తున్న భద్రతా సిబ్బంది నియామకాలు, వారి ప్రవర్తనపై తీవ్ర వివాదం రేగుతోంది.

Update: 2026-07-15 04:00 GMT

Srisailam: శ్రీశైలంలో అర్హతల్లేని సెక్యూరిటీ గార్డుల దందా? భక్తుల ఆగ్రహం

Srisailam: సాధారణంగా ఏ ఉద్యోగానికైనా కనీస అర్హత ఉంటుంది. కానీ శ్రీశైలంలో అవేమీ అమలు కావటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలోని ఓ సెక్యూరిటీ ఏజెన్సీ కింద దాదాపు 200 మందికి పైగా సెక్యూరిటీ గార్డ్స్ గా పురుషులు, మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరిలో చాలామందికి కనీస విద్యార్హత లేదని పలువురు విమర్శిస్తున్నారు.

దీనిపై సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని హిందూ సంఘాల నాయకులు కోరారు. శ్రీశైలంలో మహిళా సెక్యూరిటీల దురుసు ప్రవర్తన? శ్రీశైల దేవస్థానంలో ఓ ఏజెన్సీ కింద పనిచేస్తున్న మహిళా సెక్యూరిటీల దురుసు ప్రవర్తనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస విద్యార్హతలు లేని వీరు మీడియా, భక్తులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో వీరు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దర్శనాల దందాకు పాల్పడుతున్నారని, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News