Kurnool: ఆగస్టు 15 వరకు పంటల బీమా నమోదుకు అవకాశం కలెక్టర్ సిరి!
Kurnool: కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.
Kurnool: ఆగస్టు 15 వరకు పంటల బీమా నమోదుకు అవకాశం కలెక్టర్ సిరి!
Kurnool: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు (ప్రీమియం చెల్లింపు) గడువు ఈరోజు జూలై 31తో ముగియాల్సి ఉండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 15 వరకు మరో 15 రోజులపాటు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం, ఇతర అనుకోని పరిస్థితుల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని, అందువల్ల రుణగ్రహీత, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
సాగు చేసిన ప్రతి ఎకరానికి పంటల బీమా నమోదు చేయించుకుని భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరిగినా రక్షణ పొందాలని సూచించారు. రైతులు సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు,NCIP మొబైల్ యాప్ ద్వారా స్వయంగా లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో ఆగస్టు 15లోగా పంటల బీమా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, పోర్టల్‌పై చివరి రోజులలో ఏర్పడే రద్దీని నివారించేందుకు వీలైనంత త్వరగా పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.