Markapuram: శివపురం సమీపంలో గుర్తుతెలియని ఆటో దగ్ధం!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం శివపురం వద్ద గుర్తుతెలియని ఆటో కాలిబూడిదైన ఘటన కలకలం రేపింది.

Update: 2026-07-31 05:09 GMT

Markapuram: శివపురం సమీపంలో గుర్తుతెలియని ఆటో దగ్ధం!

Markapuram: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం శివపురం గ్రామ సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద గుర్తుతెలియని ఓ ఆటో దగ్ధమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాత్రి సమయంలో ఆటో పూర్తిగా మంటల్లో కాలిపోగా, ఉదయం గ్రామస్థులు గమనించి సమాచారం అందించారు.

ఆటోను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారా? ప్రమాదం జరిగిన తర్వాత ఆధారాలు చెరిపివేయడానికా? లేదా బీమా (ఇన్సూరెన్స్) క్లెయిమ్ కోసం నిప్పు పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఆటో యజమాని వివరాలు కూడా తెలియరాలేదు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెలుగులోకి రానున్నాయి.

Tags:    

Similar News