Nandikotkur: నందికొట్కూరులో వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి జన్మదిన వేడుకలు!

Nandikotkur: నంద్యాల జిల్లా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు ఘనం. భక్తులతో కిటకిటలాడిన ఆలయం. మహా అన్నదానం, టెన్త్ విద్యార్థులకు పురస్కారాలు.

Update: 2026-08-13 01:35 GMT

Nandikotkur: నందికొట్కూరులో వైభవంగా శ్రీ చౌడేశ్వరి దేవి జన్మదిన వేడుకలు!

Nandikotkur: నందికొట్కూరు పట్టణంలో శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు బుధవారం కన్నులపండువగా జరిగాయి.వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.ప్రెసిడెంట్ వీరనాల ప్రసాద్ ప్రధాన కార్యదర్శి చట్ట మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు.

ఉదయంww నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అమ్మవారిని అత్యంత సుందరంగా ముస్తాబు చేసి, పూలమాలలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అర్చకులు భక్తులకు హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.జై చౌడేశ్వరి మాత నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తజనులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.మహిళలు పిల్లలు వృద్ధులు సైతం బారులు తీరి, పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు..సాయంత్రం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులకు స్వయంగా వడ్డించి తమ సేవా భక్తిని చాటుకున్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.అలాగే నందికొట్కూరు ఆలయ అభివృద్ధి కమిటీ తరపున పదవ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన తోగట వీర క్షత్రియ కుటుంబాల విద్యార్థిని,విద్యార్థులకు రూ5000/చొప్పున నగదు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా వారి తల్లితండ్రులను దుస్సాలు వాలతో సత్కరించడం జరిగింది. ప్రెసిడెంట్ వీరనాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చట్టా మురళి మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రతి ఏటా జన్మదిన వేడుకలు ఇలాగే ఘనంగా నిర్వహిస్తాం.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం వారి సహకారం మరువలేనిది అని తెలిపారు.

Tags:    

Similar News