Pattikonda: మూతపడిన బంకులు.. అల్లాడుతున్న వాహనదారులు
Pattikonda: పత్తికొండ, దేవనకొండ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత. వారం రోజులుగా నిలిచిన సరఫరా వల్ల 6 పెట్రోల్ బంకులు మూత.
Pattikonda: మూతపడిన బంకులు.. అల్లాడుతున్న వాహనదారులు
Pattikonda: పత్తికొండ టౌన్, దేవనకొండ లో పెట్రోల్, డీజిల్ లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు గత కొద్ది రోజులుగా మూతపడిన 6 పెట్రోల్ బంకులు, ఆందోళనలో వాహనదారులు, వారం రోజులుగా నిలిచిన సరఫరా, మూత పడిన బంకుల్లో ఎక్కువగా హెచ్పీ, ఐఓసీ పెట్రోల్ బంకులు ఉన్నాయి. వారం రోజులుగా కడప నుంచి హెచ్పీ పెట్రో ఉత్పత్తుల సరఫరా జరగడం లేదు.
దీంతో మూడు రోజులుగా నియోజకవర్గం లోని పలు బంకులు మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, కర్నూలులో కూడా హెచ్పీ బంకులు మూతపడ్డాయి. మూతపడిన జాబితాలో ఐఓసీ బంకులు ఉన్నా వాటి సంఖ్య తక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ సరఫరాలో జాప్యాన్ని ముందే పసిగట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైంది.
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతే లేదని చెబుతున్నా అధికారులు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అధిక విని యోగం వల్లే కొరత అంటూ దాట వేస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో అవసరం మేరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరగకపోతే మరికొన్ని పెట్రోల్ బంకులు మూత పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆయిల్ కంపెనీలతో మాట్లాడాల్సి ఉంది. లే దంటే ప్రజలు మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.