Nandyal: ఎస్.కులూరు చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్.. రూ.27 లక్షల సొత్తు స్వాధీనం!

Nandyal: నంద్యాల జిల్లా గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్.కులూరులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

Update: 2026-08-24 07:09 GMT

Nandyal: ఎస్.కులూరు చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్.. రూ.27 లక్షల సొత్తు స్వాధీనం!

నంద్యాల: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్.కులూరులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.27 లక్షల విలువైన 1,074 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 20 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఏఎస్పీ సుస్మిత తెలిపారు.

గత ఏడాది జూలై 3వ తేదీన ఎస్.కులూరు గ్రామంలోని గోపవరం సత్యనారాయణ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఏఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన నాగలూరి ఆదినారాయణ, నాగలూరి ఏసోబు, నాగలూరి శివను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సుస్మిత తెలిపారు.

పోలీసుల విచారణలో నిందితులు రేవనూరు, నంద్యాల తాలూకా, కడప జిల్లా వల్లూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా చోరీలకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు. చోరీ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న గోస్పాడు ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ సుస్మిత అభినందించారు.

Tags:    

Similar News