Penamaluru: తెన్నేరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Penamaluru: పెనమలూరు మండలం తెన్నేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పంపిణీ చేశారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని వెల్లడించారు.

Update: 2026-09-01 10:34 GMT

Penamaluru: తెన్నేరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పెనమలూరు: తెన్నేరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు. పేదలు,వృద్ధులు,వితంతువులు,దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పెనమలూరు ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ గారు అన్నారు,తెన్నేరు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మాట్లాడుతూ...అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు,పింఛన్లను ఇంటి వద్దకే అందిస్తూ వృద్ధులు,వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందని,అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు,ప్రజలకు అవసరమైన ప్రతి సందర్భంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు,అధికారులు, లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు...

Tags:    

Similar News