Nandigama: విభిన్న ప్రతిభావంతులకు స్కూటీల పంపిణీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య!

Nandigama: నందిగామలో విభిన్న ప్రతిభావంతులకు నూతన స్కూటీలను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. స్వావలంబనే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి.

Update: 2026-09-01 07:52 GMT

Nandigama: విభిన్న ప్రతిభావంతులకు స్కూటీల పంపిణీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య!

Nandigama: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, విభిన్న ప్రతిభావంతులకు ఆత్మవిశ్వాసం, స్వావలంబన కల్పించే దిశగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.

నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో ఉన్న తన కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులకు మంజూరైన నూతన స్కూటీలను లబ్ధిదారులకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడి, స్కూటీలను సద్వినియోగం చేసుకుని విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు.

చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమానికి కొత్త ఊపిరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారు ఇతరులపై ఆధారపడకుండా తమ పనులను తాము చేసుకునేలా అవసరమైన సహాయాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తోందన్నారు.

స్వావలంబనకు స్కూటీలు ఎంతో ఉపయోగకరం

నూతన స్కూటీలు లబ్ధిదారుల రోజువారీ ప్రయాణ అవసరాలకు ఎంతో ఉపయోగపడటమే కాకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులభంగా చేరుకోవడానికి దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత ప్రజల అవసరాలను గుర్తించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తంగిరాల సౌమ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News