Kothagudem: డప్పు కళాకారులకు ₹5 వేల పెన్షన్ ఇవ్వాలి: టి ఎమ్మార్పీఎస్!
Kothagudem: డప్పు కొట్టే మాదిగ కళాకారులకు నెలకు ₹5 వేల పెన్షన్, ఉద్యమకారులకు 200 గజాల స్థలంతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.
Kothagudem: డప్పు కళాకారులకు ₹5 వేల పెన్షన్ ఇవ్వాలి: టి ఎమ్మార్పీఎస్!
కొత్తగూడెం, ఆగస్టు 17 : డప్పు కొట్టే మాదిగలకు నెలకు రూ.5 వేల పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వినతిపత్రం అందజేశారు. టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండా రమేష్ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి తమ డిమాండ్లను వివరించారు.
మాదిగ దండోరా ఉద్యమకారులకు 200 గజాల స్థలం కేటాయించి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని, అర్హులైన దళితులకు అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పందిస్తూ, టి ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రస్తావించిన సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు జీడి శ్రీనివాస మాదిగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మచ్చ పృథ్వీరాజ్ మాదిగ, బొమ్మెర అశోక్ మాదిగతో పాటు పలువురు టి ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.