Thirumalayapalem: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ సునీల్ దత్

తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు పరిశీంచారు. సీసీటీఎన్‌ఎస్ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని, కేసుల దర్యాప్తు పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి విధినిర్వహణపై పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Tags: