Bhadrachalam: శరత్ హత్య కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్.. పోలీసులు
Bhadrachalam: భద్రాచలం సత్యసాయి లాడ్జి వద్ద ఘర్షణలో తెల్లం శరత్ బాబు మృతి; లాడ్జి నిర్వాహకులు ద్వార మణికంఠ, బర్ల వినయ్ అరెస్ట్, కోర్టు రిమాండ్.
Bhadrachalam: శరత్ హత్య కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్.. పోలీసులు
భద్రాచలం: తెల్లం శరత్ బాబు మృతికి కారణమైన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 16.11.2026వ తేదీన మృతుడు తెల్లం శరత్ బాబు వద్దకు అతని స్నేహితులు మరియు బంధువులైన కుర్సం నాగప్రశాంత్, కీసర కార్తీక్‌లు కలిసేందుకు భద్రాచలం వచ్చారు. వారు రాత్రి బస చేసేందుకు గది కోసం వెతుకుతూ, అదే రోజు రాత్రి సుమారు 10:00 గంటల సమయంలో భద్రాచలం రామాలయం సమీపంలోని సత్యసాయి లాడ్జికి వెళ్లి గది కావాలని అడిగారు.
ఈ క్రమంలో లాడ్జి యజమాని ద్వార మణికంఠ మరియు లాడ్జి బాయ్ బర్ల వినయ్‌లు గది కేటాయింపు విషయంలో సదరు ముగ్గురు వ్యక్తులతో వాగ్వాదానికి దిగి, వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తెల్లం శరత్ బాబు తీవ్రంగా గాయపడి, రోడ్డుపై స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై మృతుడి తండ్రి తెల్లం రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులైన ద్వార మణికంఠ మరియు బర్ల వినయ్‌లను 20.11.2026వ తేదీన భద్రాచలం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రాచలం పట్టణ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాము.