Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభం
Kothagudem: 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను మంజూరు చేసిన ఆర్‌బీఐ. సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లితో పాటు పలు మండలాల్లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్లు.
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభం
కొత్తగూడెం: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ధిక అక్షరాస్యత, ఆర్ధిక అవగాహనను పెంపొందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను ( సుజాత నగర్, లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి , మణుగూరు, భద్రాచలం, దమ్మపేట ) మంజూరు చేశారు.
ప్రతి కేంద్రంలో "విడ్స్ " స్వచ్ఛంద సంస్థ ద్వారా, ముగ్గురు కౌన్సిలర్స్ ను నియమించి, వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు వారికి కేటాయించిన గ్రామాలలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రజలకు పొదుపు, పెట్టుబడి, ఆర్ధిక క్రమశిక్షణ, బ్యాంక్ లావాదేవీలపై అవగాహన, బ్యాంక్ రుణాలు, సక్రమ రుణ చరిత్ర అవశ్యకత, సైబర్ మోసాల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
ఈ సందర్భంగా, పోస్టర్ ను వేణుగోపాల్, అధనపు కలెక్టర్ (రెవెన్యూ), శ్రీమతి .విద్యాచందన, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆవిష్కరించారు.
ఆర్థిక వ్యవహారాలలో సరైన అవగాహన, అప్రమత్తత చాలా అవసరమని, రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా చర్యలు తీసుకోవడం అభినందనీయమని శ్రీ. వేణు గోపాల్, అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామాలలో జరిగే ఈ ఆర్థిక అవగాహన కార్యక్రమాలకు సహకరించే విధంగా గ్రామ స్థాయి సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్ధిక శిక్షణా కేంద్రాల కౌన్సిలర్స్ పాల్గొన్నారు.