Julurupadu: జూలూరుపాడు ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
Julurupadu: ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనంగా నిర్వహించాలని జూలూరుపాడులో ఆదివాసి నాయకుల నిర్ణయం. హక్కులు, అభివృద్ధిపై ప్రత్యేక చర్చ.
Julurupadu: జూలూరుపాడు ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు
జూలూరుపాడు: జూలూరుపాడు మండలంలో ఈరోజు ఆదివాసి ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత సమావేశమై ఆదివాసుల హక్కులు, అభివృద్ధి మరియు ఆగస్టు 9న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.
ఈ సమావేశంలో అనంతారం గ్రామ సర్పంచ్ కొరసా రమేష్ గారు, శంభునిగూడెం గ్రామ సర్పంచ్ తాటి సువార్త గారు, నల్లబండబోడు గ్రామ సర్పంచ్ గలిగి సింధు గారు, మండల నాయకులు కాలం నరసింహారావు గారు, బచ్చల అశోక్ గారు, మలకం వీరభద్రం గారు, దొడ్డ వెంకటేశ్వర్లు గారు, తాటి అరుణ్ గారు మరియు సోడె శ్రీరాములు గారు పాల్గొన్నారు.
సమావేశంలో ప్రధానంగా జి.ఓ. నెం. 3 పునరుద్ధరణ, 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడం, చదువుకున్న ఆదివాసి యువతీ యువకులకు పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
అలాగే ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని జూలూరుపాడు మండలంలో అన్ని గ్రామాల ఆదివాసులు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, విద్యార్థులు పాల్గొనేలా ఐక్యంగా, ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ఆదివాసుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, రాజ్యాంగబద్ధ హక్కులు, విద్యాభివృద్ధి మరియు సామాజిక ఐక్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆదివాసుల హక్కుల పరిరక్షణ, విద్యా పురోగతి, యువత సాధికారత మరియు సమాజ ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.