Peddapalli: నేడు సుల్తానాబాద్‌లో మంత్రుల పర్యటన, అభివృద్ధి పనుల ప్రారంభం
Peddapalli: ఆగస్టు 19న సుల్తానాబాద్‌లో రూ.250 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం. హాజరుకానున్న మంత్రులు. భారీగా తరలిరావాలని కాంగ్రెస్ నేతల పిలుపు.
Peddapalli: నేడు సుల్తానాబాద్‌లో మంత్రుల పర్యటన, అభివృద్ధి పనుల ప్రారంభం
పెద్దపల్లి: ఈనెల19 నా బుధవారం రోజున సుల్తానాబాద్ పట్టణంలో జరిగే మంత్రుల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు అధిక సంఖ్యలో నియోజవర్గ ప్రజలు తరలి రావాలని ఓదెల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మండలంలోని సర్పంచ్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుల్తానాబాద్ పట్టణంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నాయకత్వంలో రూ.250 కోట్ల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , తుమ్మల నాగేశ్వర రావు గార్లు వస్తున్న నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం ప్రణాళిక బద్దంగా ముందుకు పోతుందని కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధి బైరి రవి గౌడ్ మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.