Karimnagar: కదం తొక్కిన కరీంనగర్ పాల డైరీ రైతులు: కలెక్టరేట్ ముట్టడి
Karimnagar: కరీంనగర్ డైరీ భూములను తెలంగాణ ఫెడరేషన్‌లోకి మార్చడాన్ని నిరసిస్తూ పాడి రైతుల భారీ ర్యాలీ. ధరణిలోకి మార్చి డైరీకి అప్పగించాలని డిమాండ్.
Karimnagar: కదం తొక్కిన కరీంనగర్ పాల డైరీ రైతులు: కలెక్టరేట్ ముట్టడి
Karimnagar: లక్ష మంది పాడి రైతులు గల కరీంనగర్ డైరీ ని ప్రభుత్వం ధరణి నుండి భూములను తొలగించి భూభారతిలో చేర్చుకొని రైతులను ఆందోళనకు గురి చేస్తున్న సందర్భంగా భారీ నిరసన చేపట్టారు. పద్మ నగర్ డైరీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ కరీంనగర్ డైరీ ని ధరణి పోర్టల్ నుండి తొలగించి తెలంగాణ ఫెడరేషన్ పేరు మీదికి మార్చుకున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం తక్షణమే కరీంనగర్ డైరీ కి సంబంధించిన భూములను డైలీ పేరు మీద తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. డైరీ ని నమ్ముకొని లక్షల మంది పాడి రైతుల కుటుంబాలు బతుకుతున్నాయని అన్నారు. ప్రభుత్వం పాడి రైతులకు రెండు గేదెలను 50 శాతం సబ్సిడీపై అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కరీంనగర్ డైరీ కాలనీ వాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాడి రైతులకు పాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని తెలిపారు. పాడి రైతులు అనేక సమస్యలను అనుభవిస్తున్నారని అలాంటి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. లక్ష కుటుంబాలను వీధిల పాలు చేయకుండా చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2000 మంది పాడి రైతులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.