Siricilla: ప్రేమ వివాహం విషయంలో వ్యక్తిపై కత్తితో దాడి - ఇద్దరు అరెస్ట్
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ప్రేమ వివాహం కక్షతో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.
Siricilla: ప్రేమ వివాహం విషయంలో వ్యక్తిపై కత్తితో దాడి - ఇద్దరు అరెస్ట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రేమ వివాహం విషయంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను కోనరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కత్తి, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. కోనరావుపేటకు చెందిన దండగుల సురేష్ (21), కంచర్లకు చెందిన అతని స్నేహితుడు గోగుల రామకృష్ణ (21) ఈ ఘటనకు పాల్పడ్డారు. సురేష్ చెల్లెలు మరియా, మల్కాపేటకు చెందిన శివరాత్రి అజయ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.
ఆగస్టు 16న సురేష్ తాత మృతి చెందడంతో మరియా, అజయ్ కోనరావుపేటకు వచ్చారు. ఈ సమయంలో సురేష్ తల్లి యాదవ్వకు, మరియకు మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని తల్లి సురేష్‌కు చెప్పడంతో.. తన చెల్లెలు నిమ్మపల్లిలో ఉందని తెలుసుకున్న సురేష్, అజయ్‌పై దాడి చేయాలని పథకం వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తన స్నేహితుడు రామకృష్ణను బైక్‌పై వెంట తీసుకుని నిమ్మపల్లికి వెళ్లిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో అజయ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో అజయ్ ఛాతి, కడుపు, వీపుపై రక్తగాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై అదే రోజు కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, నేరానికి ఉపయోగించిన కత్తి, బైక్‌ను సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో చురుకుగా దర్యాప్తు చేసిన కోనరావుపేట ఎస్సై కె. ప్రశాంత్ రెడ్డి, పోలీసు సిబ్బందిని చందుర్తి సీఐ కె. రవీందర్ అభినందించారు.