Sircilla: రాష్ట్రపతి భవన్‌లో సిరిసిల్ల విద్యార్థిని కారుణ్య సందడి!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా దుమాల ఏకలవ్య పాఠశాల విద్యార్థిని కొర్ర కారుణ్యకు అరుదైన గౌరవం. రాష్ట్రపతి భవనంలో భేటీ.

Update: 2026-08-30 07:02 GMT

Sircilla: రాష్ట్రపతి భవన్‌లో సిరిసిల్ల విద్యార్థిని కారుణ్య సందడి!

Sircilla: ప్రతిభకు పల్లె, పట్టణం అనే తేడా లేదని నిరూపించింది దుమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని కొర్ర కారుణ్య. తన ప్రతిభతో జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికై. ఏకంగా రాష్ట్రపతిని కలిసే అవకాశం దక్కించుకుంది.

2025 విద్యా సంవత్సరంలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమాల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన గిరిజన గురుకుల విద్యార్థులను ఎంపిక చేశారు. ఇందులో 8 నుంచి 15 ఏళ్ల వయసున్న 89 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపికైన విద్యార్థుల్లో కారుణ్య కూడా ఉండటం విశేషం.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యార్థులు రాష్ట్రపతితో భేటీ అయ్యారు. తమ విద్యాభ్యాసం, ప్రతిభకు సంబంధించిన అంశాలను వివరించే అవకాశం పొందారు. విద్యార్థుల ప్రతిభను రాష్ట్రపతి అభినందించడంతో పాటు వారితో కలిసి ఫొటోలు దిగారు.

ఇంత చిన్న వయసులోనే దేశ ప్రథమ పౌరుడిని కలుసుకోవడం కారుణ్యకు మరపురాని అనుభూతిగా మిగిలింది. దుమాల ఏకలవ్య పాఠశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం పట్ల పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News