Sircilla: సిరిసిల్ల కాలువను శుభ్రం చేసిన 7వ వార్డు కౌన్సిలర్

Sircilla: సిరిసిల్లలో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంపై కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం నిరసన. స్వయంగా మురికి కాలువను శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్.

Update: 2026-07-15 11:02 GMT

Sircilla: సిరిసిల్ల కాలువను శుభ్రం చేసిన 7వ వార్డు కౌన్సిలర్

సిరిసిల్ల: మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ 7వ వార్డు కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం స్వయంగా మురికినీటి కాలువను శుభ్రం చేశారు. మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో వార్డు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తానే రంగంలోకి దిగినట్లు తెలిపారు.

దాదాపు గంటపాటు శ్రమించి కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, మురికినీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమయంలో వార్డును పరిశుభ్రంగా ఉంచుతానని ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికే ఈ పని చేశానని కౌన్సిలర్ ఎర్రం వెంకటరాజం తన సన్నిహితులకు తెలిపారు.

వీడియోను చూసిన నెటిజన్లు ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి స్వయంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన కౌన్సిలర్‌ను ప్రశంసిస్తూ, "ప్రజా ప్రతినిధి అంటే ఇలాగే ఉండాలి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News