Sircilla: వ్యర్థాల రీసైక్లింగ్ విధానాలపై అధికారులతో సమీక్ష!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రిసోర్స్ పార్క్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, పాలకవర్గ సభ్యులతో కలిసి బుధవారం సందర్శించారు.
Sircilla: వ్యర్థాల రీసైక్లింగ్ విధానాలపై అధికారులతో సమీక్ష!
సిరిసిల్ల: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పారిశుధ్య విభాగం–రిసోర్స్ పార్క్ సందర్శన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణితో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, పట్టణంలో ప్రతి రోజు సేకరించే తడి, పొడి, సానిటరీ, హానికర వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేసి పునర్వినియోగంలోకి తీసుకువచ్చే విధానాలను సభ్యులకు వివరించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డులో చెత్తను కేవలం నిల్వ చేయకుండా, వ్యర్థాల నుంచి ఆదాయం పొందేలా తీసుకుంటున్న చర్యలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రజలు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా స్వచ్ఛత నియమాలు పాటించాలని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి నీటి వృథాను నివారించాలని ఆమె సూచించారు. భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రమైన సిరిసిల్ల నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం పాలకవర్గ సభ్యులతో కలిసి తడి చెత్త నుంచి విండ్రో కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ తయారీ విధానాలను పరిశీలించారు. పొడి చెత్తను వేర్వేరు రకాలుగా విభజించి రీసైక్లింగ్‌కు పంపే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిశ్రమ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం ఏర్పాటు చేసిన యంత్రాల పనితీరును కూడా పరిశీలించారు.
కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల ప్రాధాన్యంపై ప్రతిజ్ఞ చేయడంతో పాటు రిసోర్స్ పార్క్‌లో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు, శ్రీ గ్రీన్ వర్క్ ఫౌండేషన్ ప్రతినిధులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.