Sircilla: ఆక్సిజన్ సిలిండర్‌తో ప్రజావాణికి వృద్ధుడు భూ సమస్యపై కలెక్టర్‌కు వినతి

Sircilla: సిరిసిల్ల ప్రజావాణికి ఆక్సిజన్ సిలిండర్‌తో వచ్చిన వృద్ధుడు కాసర్ల దేవారెడ్డి. భూ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి.

Update: 2026-08-25 04:40 GMT

Sircilla: ఆక్సిజన్ సిలిండర్‌తో ప్రజావాణికి వృద్ధుడు భూ సమస్యపై కలెక్టర్‌కు వినతి

Sircilla: తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్‌పై ఆధారపడుతున్న ఓ వృద్ధుడు తన భూమి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆక్సిజన్ సిలిండర్‌తో కుటుంబ సభ్యులతో కలిసి ప్రజావాణికి హాజరయ్యారు. కోనరావుపేట మండలం పల్లి మక్తా గ్రామానికి చెందిన కాసర్ల దేవారెడ్డి తన సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

గత 15 ఏళ్లుగా భూమి తన పేరుపై ఉందని దేవారెడ్డి తెలిపారు. అయితే తన అన్న కాసర్ల బాల్‌రెడ్డి ఆ భూమిని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భూమికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడిచిందని, భూమి తనదేనంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.

కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తన అన్న సమస్యను పరిష్కరించకుండా భూమిని సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని దేవారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆక్సిజన్‌పై ఆధారపడుతున్నప్పటికీ.. సమస్యకు పరిష్కారం కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఆక్సిజన్ సిలిండర్‌తో ప్రజావాణికి వచ్చారు.

తన పరిస్థితిని, భూమి సమస్యను కలెక్టర్‌కు వివరించిన దేవారెడ్డి అధికారులు జోక్యం చేసుకుని కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తన భూమి సమస్యను పరిష్కరించాలని కోరారు. తనకు న్యాయం చేసి భూమిని సాగు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News