Karimnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ భిక్ష కాదు.. విద్యార్థుల హక్కు: బీజేపీ!

Karimnagar: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

Update: 2026-08-24 17:20 GMT

Karimnagar: ఫీజు రీయింబర్స్‌మెంట్ భిక్ష కాదు.. విద్యార్థుల హక్కు: బీజేపీ!

కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు నిరాహార దీక్షకు సంఘీభావంగా , రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కరీంనగర్‌లో నిరసన దీక్ష చేపట్టిన బిజెపి జిల్లా శాఖ. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.

ఇందులో భాగంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆగస్టు 24, 25 తేదీల్లో చేపడుతున్న రెండు రోజుల నిరాహార దీక్షకు సంఘీభావంగా.. కరీంనగర్ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేపట్టింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి ల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. కాలేజీ యాజమాన్యాలు ఫీజుల చెల్లింపు కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తుండటంతో సర్టిఫికెట్లు అందక, పరీక్షలకు హాజరుకాక విద్యార్థులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఇచ్చే బిక్ష కాదని, అది విద్యార్థుల హక్కు అని , ప్రభుత్వం తక్షణమే స్పందించి పేరుకుపోయిన బకాయిలన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. "విద్యార్థుల హక్కుల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి వైఖరిని వీడి బకాయిలను విడుదల చేయకపోతే, రాబోయే రోజుల్లో రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడవెంకటరెడ్డి , ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, అడిచెర్ల రాజు , అవదుర్తి శ్రీనివాస్, కార్పొరేటర్ కొమురయ్య , నాయకులు పెద్దపల్లి జితేందర్, గుంజేటి శివ , సుధాకర్ పటేల్ , వెంకటేష్ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ లు ఫీజు రియంబర్స్మెంట్ వైఖరి పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరిని తప్పు పట్టారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా తక్షణమే రూ.12 వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కోలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి,కన్నా కృష్ణ ,సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాస్ రావు ,జిల్లా కార్యదర్శి సిహెచ్ నరసింహరాజు, చేపూరీ సత్యం మీడియా కన్వీనర్ కటకం లోకేష్ మండల అధ్యక్షులు మడిశెట్టి సంతోష్, కంది రాజిరెడ్డి ,చింతం శ్రీనివాస్ ,తనకు సాయికృష్ణ, పాదం శివరాజ్, కార్పొరేటర్ లు బండ రమణ రెడ్డి, దేశీ శిల్పా పెద్దపల్లి శ్రీలేఖ ,తాటి ప్రభావతి మాసం గణేష్ ,భూపతి రవీందర్, తోట అనిల్. టీంకు, ఒంటెల సత్యనారాయణ రెడ్డి ,మహిళా మోర్చఅధ్యక్షులు గుర్రాల నిర్మల రెడ్డి , ఎస్టి మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మోతే గంగారెడ్డి , వెంకట్ రెడ్డి , ఓ బి సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఆడి చెర్ల రాజు రమేష్ దూలం కిరణ్, ఆవుల తిరుపతి ,రవి ప్రసాద్ గుర్రం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News