Narayanpur: గ్రామసభలో అవమానాలు.. నారాయణపూర్ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

Narayanpur: కరీంనగర్ జిల్లా గంగధర మండలం నారాయణపూర్ గ్రామసభలో కొందరు రాజకీయ దురుద్దేశంతో అవమానించడంతో సర్పంచ్ భర్త మధు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Update: 2026-08-05 13:53 GMT

Narayanpur: గ్రామసభలో అవమానాలు.. నారాయణపూర్ సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం

నారాయణపూర్: కరీంనగర్ జిల్లా గంగధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. నారాయణపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్న సమయంలో గ్రామ సర్పంచ్, సర్పంచి భర్త మధును టార్గెట్ చేసి గ్రామంలోని కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో భరించలేని సర్పంచ్ భర్త ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త ఆత్మహత్య ప్రయత్నం విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మధును పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమని తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓదార్చి వివరాలు అడిగి మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాదుకు తరలించాలని డాక్టర్లను కోరారు.

నారాయణపూర్ గ్రామాన్ని గతంలోనే గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు రెండు వర్గాలుగా విడిపోయారని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. మేము కూడా దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందిస్తామని ఇదివరకే తెలిపామని ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరమని తెలిపారు. నారాయణపూర్ గ్రామస్తులు ఎవరు కూడా ఇలాంటి రాజకీయ దురుద్దేశాలు చేయొద్దని దశలవారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యకు పురిగోల్పడం సమంజసం కాదని మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం చవకపారు పనులు మానుకోవాలని ప్రజల మేలు కోసం పనిచేయాలే తప్ప రాజకీయ పబ్బం గడపడానికి కాదని సూచించారు. బాధితుడు దీకొండ మధుకు మెరుగైన చికిత్స అందించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎవరు కూడా ఇలా ఒకరి ప్రాణాలు తీయడం కోసం అబద్దాలను నిందలను వేయకూడదని, ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుందని ప్రజలకు ఎవరి కూడా నష్టం జరగదని అన్నారు.

Tags:    

Similar News