Karimnagar: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం నియామకం!
Karimnagar: కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది సాయిని మల్లేశం నియమితులయ్యారు.
Karimnagar: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం నియామకం!
Karimnagar: కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా సాయిని మల్లేశం నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. సాయిని మల్లేశం ప్రముఖ న్యాయవాది. ఆయన ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్‌లో క్రియాశీలకంగా పనిచేసి, ప్రస్తుతం హుస్నాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నూతన అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కరీంనగర్ జిల్లా బీజేపీ బాధ్యతలను అప్పగించిన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, అలాగే ఈ నియామకానికి సహకరించిన జిల్లా, రాష్ట్ర నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి తనవంతు శాయశక్తులూ కృషి చేస్తానని సాయిని మల్లేశం తెలిపారు.
సాయిని మల్లేశంను సన్మానించిన బిజెపి శ్రేణులు..
కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గా నియమితులైన సాయిని మల్లేశం ను బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సాయిని మల్లేశం సతీమణి సాయిని సుచిత్ర వీర తిలకం దిద్దారు...ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కర్రే పద్మ - అనిల్, ఎన్నం లక్ష్మీ - ప్రకాష్, ప్రమోద్ రావు, జిల్లా మీడియా కన్వీనర్ కటకం లోకేష్,సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పరపెల్లి శ్రీనివాస్, గుంజేటి శివరాం, అడిచెర్ల రాజు , యువమొర్చ నాయకులు ఈసంపెళ్లి మహేష్, చిక్కుల కిరణ్ , దుబాయ్ శ్రీను,చంద్రశేఖర్ రెడ్డి,గిరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.