Jammikunta: జమ్మికుంటలో ఆగస్టు 31లోగా 'చేయూత' పెన్షన్ల డేటా సేకరణ!

Jammikunta: అర్హులైన వారందరి నుంచి ఆగస్టు 31, 2026లోగా 'చేయూత' పెన్షన్ దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్ చేయాలని మున్సిపల్ కమిషనర్ జి. మల్లికార్జున స్వామి అధికారులను ఆదేశించారు.

Update: 2026-08-12 15:44 GMT

Jammikunta: జమ్మికుంటలో ఆగస్టు 31లోగా 'చేయూత' పెన్షన్ల డేటా సేకరణ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బుధవారం వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ జి. మల్లికార్జున స్వామి, మున్సిపల్ చైర్‌పర్సన్ ములుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ, ప్రతి వార్డులో కౌన్సిలర్ల సహకారంతో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి చేయూత పెన్షన్లపై వివరాలు సేకరించాలని సూచించారు.

ప్రతి వార్డులో పెన్షన్ అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ పొందని వారిని గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయించాలని తెలిపారు. చేయూత పెన్షన్లలో వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు తదితర అర్హులైన వారు ఎవరైనా పెన్షన్ పొందకుండా ఉన్నట్లయితే వారిని గుర్తించి, మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక పెన్షన్ దరఖాస్తు కేంద్రం ఏర్పాటు చేయడమైనది.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకం అందేలా ఇంటింటికీ వెళ్లి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి, ఎలాంటి అర్హుడు కూడా పథకానికి దూరం కాకుండా చర్యలు తీసుకోవాలనిఅధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, ఏఈ వికాస్, జేఏఓ రాజశేఖర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఐ. రమేష్, టీపీబీవో దీపిక, సీనియర్ అసిస్టెంట్ భాస్కర్, శ్రీనివాస్, వార్డు ఆఫీసర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News