Jagtial: పేదల ఇంటికి గృహప్రవేశం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే!

Jagtial: జగిత్యాల జిల్లా నూకపెల్లిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పర్యటన. ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం మరియు హైమాక్స్ లైట్ల ప్రారంభం.

Update: 2026-05-04 02:49 GMT

Jagtial: పేదల ఇంటికి గృహప్రవేశం చేసిన చొప్పదండి ఎమ్మెల్యే!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం నూకపెల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి శాసనసభ్యులు మరియు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకం కింద లబ్ధిదారులు పడిగల వంశీ – శిరీషల నూతన గృహానికి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించి, ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత గ్రామ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్‌ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News