Mallareddypalli: మల్లారెడ్డిపల్లిలో దేవాలయ ప్రారంభోత్సవం, సాంస్కృతిక వేడుకలు
Mallareddypalli: కరీంనగర్ మల్లారెడ్డిపల్లిలో శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
Mallareddypalli
వీణవంక మండలం: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ దేవాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించారు.
ఈ సందర్భంగా వీణవంకకు చెందిన కైరవి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు భరతనాట్య ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారులు బత్తిని సహస్రీ, అనగోని హరిప్రియ, గట్టు స్ఫూర్పిక, సత్రపు సాయి తనస్వి, దాడ రితిక, సూరోజు గగన్యా, అవికానందన్ (గోదావరిఖని) తమ నృత్యాలతో భక్తులను అలరించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోనెల సమ్మన్న ముదిరాజ్ మాట్లాడుతూ, దేవాలయ ప్రారంభోత్సవం మరియు వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఎంతో ఆనందాన్ని కలిగించాయని అన్నారు. వారికి శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ముద్ధసాని శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి బండారి సందీప్, పల్లెర్ల కిరణ్ గుప్తా, కర్రె వెంకట నర్సయ్య, దరిపెల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.