Pithapuram: పిఠాపురం అర్జీల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం
Pithapuram: పిఠాపురంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 65 అర్జీలు స్వీకరణ. పాడా అభివృద్ధి పనులపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.
Pithapuram: పిఠాపురం అర్జీల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం
పిఠాపురం: "ఒక నెల - ఒక గ్రామం - నాలుగు సందర్శనలు" కార్యక్రమం వరుసగా రెండో వారం శుక్రవారం పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పాడా పీడీ ఎన్.వి.శివ రామ్ ప్రసాద్ ఇతర అధికారులతో కలిసి పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులను స్వీకరించారు.
ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్, గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పౌర సరఫరాలు, వ్యవసాయం, ఆర్‌డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, ఎండోమెంట్స్, కార్మిక, డీఆర్‌డీఏ, కాలుష్య నియంత్రణ, గనులు, భూగర్భ, ఎక్సైజ్ తదితర శాఖలకు చెందిన 65 అర్జీలు అందాయి. ఈ అర్జీలు ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ తక్షణమే సమగ్ర పరిశీలన చేసి గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పిఠాపురంలో నిర్వహించడం జరిగుతుందన్నారు. పిఠాపురం నియోజకవర్గస్థాయిలో ఈ వారం నిర్వహించిన ఒక నెల -ఒక గ్రామం - నాలుగు సందర్శనలు కార్యక్రమాని 65 అర్జీలను స్వీకరించామన్నారు.
గత వారంలో స్వీకరించిన అర్జీలతో కలిపి, పెండింగ్ ఉన్న వాటిలో సుమారు 15 అర్జీలను ఇప్పటికే పరిష్కరించామని, మిగిలిన సమస్యలను మండల, డివిజన్ స్థాయి అధికారుల సమన్వయంతో వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించమన్నారు. ప్రధానంగా సర్వే సమస్యలు, భూ విస్తీర్ణంలో తేడా, డ్రైనేజీలు, రోడ్ల అవసరాలపై ఎక్కువ అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ వివరించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో తగిన పరిష్కారాలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అర్జీలకు సంబంధించిన పరిష్కార నివేదిక పాడా కార్యాలయానికి పంపించాలన్నారు. ఈ వారం అందిన అర్జీలను వచ్చే శుక్రవారం నాటికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
పాడా పరిధిలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష:
పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ - పాడా కింద చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. సమీక్ష నిర్వహించారు. పాడా కింద పిఠాపురం నియోజకవర్గం లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులలో తప్పనిసరిగా పురోగతి కనబరచాలన్నారు. ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, పీహెచ్సీ, విద్యుత్, దేవాదాయ, నగరవణాలు, పాఠశాలలో వివిధ మౌలిక సదుపాయాలు కల్పన, సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి పనులు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ పనులకు వివధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేస్తామని, అలాగే ఇప్పటికే మంజూరైన పనులు టెండర్ స్థాయిలో ఉన్నాయన్నారు. కొన్ని ఇరిగేషన్ పనులను డిఎంఎఫ్ ద్వారా మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు ఈ పనులన్నిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి, నిర్దేశించిన లక్ష్యంలోపు నిర్మాణ పనులు పూర్తిచేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో పిఠాపురం కమిషనర్ ఎస్.టి.రాజేశ్వర రావు, డిడిఓ పి.వాసుదేవరావ్, ఎపీడీ వశంత మాధవి పిఠాపురం నియోజకవర్గంలోని మిగిలిన మండలాలు తహశీల్దార్లు, ఎంపీడీవోలు, పురపాలక కమిషనర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.