Kirlampudi: ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే
Kirlampudi: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Kirlampudi: ముద్రగడ పద్మనాభం మృతి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే
Kirlampudi: కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి తీరనిలోటు అని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు.
గురువారం కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి మాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఉంగుటూరు నియోజకవర్గ కాపు నాయకులు, పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్బంగా ముద్రగడ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ముద్రగడ పద్మనాభం కాపు సమాజ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన నాయకుడని, ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాట యోధుడిగా ముద్రగడ నిలిచిపోయారని, ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు, కాపు సమాజానికి తీరని లోటని వాసుబాబు పేర్కొన్నారు.