Pithapuram: పిఠాపురం ముద్రగడ పద్మనాభంకు నివాళులు
Pithapuram: ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ. పద్మనాభం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించిన టీడీపీ నేతలు.
Pithapuram: పిఠాపురం ముద్రగడ పద్మనాభంకు నివాళులు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గము..... ముద్రగడ పద్మనాభం మరణించిన కారణం తెలుసుకొని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్ వి ఎస్ ఎన్ వర్మ వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.
వర్మ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ప్రజలకు ఒక మాట ఇస్తే ఆ మాట కోసం ఎంతవరకు అయినా పోరాడి సాధించే వ్యక్తి అటువంటి పద్మనాభం మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశారు. అదే విధంగా ముద్రగడ పద్మనాభం నాకు వ్యక్తిగతంగా చాలా మంచి స్నేహితులు.
అలానే వారి కుమారులైన బాలు మరియు గిరికి ఆ భగవంతుడు అండగా ఉండాలని ఆయన్ని కోరుకుంటున్నాను. పిఠాపురం నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని ముద్రగడ పద్మనాభం కు నివాళులు అర్పించడం జరిగింది.