Girinagar: నిద్రపోతున్న యువకుడిపై బంధువుల మూకుమ్మడి దాడి!

Girinagar: పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో నిద్రపోతున్న అశోక్ అనే యువకుడిపై బంధువుల మూకుమ్మడి దాడి. రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు.

Update: 2026-08-22 05:12 GMT

Girinagar: నిద్రపోతున్న యువకుడిపై బంధువుల మూకుమ్మడి దాడి!

Girinagar: పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీ గిరినగర్‌లో అశోక్ పై అతడి బంధువులు ఉదయం 6:00 గంటలకు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బంధువులు రాళ్లు, కర్రలతో దాడి చేయడంతో యువకుడు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

గాయపడిన అశోక్ అనే యువకుడిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఘటనకు గల కారణాలు అసబ్యంగా కుటుంబ సభ్యులను తిట్టాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

Tags:    

Similar News